ఎమ్మెల్సీ కోలగట్ల కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన వైఎస్ జగన్

విజయనగరం: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి ప్రథమ కుమార్తె సంధ్య, నాగాభిషేక్‌ల వివాహ రిసెప్షన్ మంగళవారం ఘనంగా జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యక్రమానికి హాజరై వివాహబంధంతో ఒక్కటవుతున్న సంధ్య,నాగాభిషేక్‌లను ఆశీర్వదించారు. నిండునూరేళ్లు వర్థిల్లాలని శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రాత్రి 8.15 గంటల సమీపంలో వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం వీరభద్రస్వామి కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడారు. జగన్‌ను చూసేందుకు పార్టీ నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అరగంట సేపు జగన్‌మోహన్ రెడ్డి అక్కడే గడిపి, అక్కడి నుంచి రాత్రి బస చేసే జిల్లా పరిషత్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు.  
 
వధూవరులను ఆశీర్వదించిన వారిలో ప్రతిపక్ష ఉప నాయకులు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు ఆర్‌వీ సుజయకృష్ణ రంగారావు, రోజా, పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్న దొర, బేబీనాయన, ఈశ్వరి, కొండపల్లి అప్పలనాయుడు, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ,  మాజీ ఎమ్మెల్యేలు శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు, ముత్యాలనాయుడు, బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నా యుడు, పరీక్షిత్ రాజు,  కంబాల జోగులు, కాకర్ల పూడి శ్రీనివాసరాజు, అవనాపు విజయ్ తదితరులున్నారు. అలాగే వధూవరులను ఆశీర్వదించిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ పరిశీలకులు ఆర్‌వీఎస్‌కేకే రంగారావు(బేబీనాయన), పార్టీ రాష్ట్ర కార్యదర్శి సవరపు జయమణి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొణతాల రామకృష్ణ మరి కొందరు ప్రముకులు హాజరయ్యారు.
Back to Top