వైయస్సార్ జిల్లా) ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేశారు. పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షులు అంజాద్ బాషా నేతృత్వంలో విందు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా వైయస్ జగన్ విచ్చేశారు. దీనికి ముందు ఆయన కడపలోని అమీన్‌పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ఇమామ్ ఆరిపుల్లా హుస్సేన్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.<br/>అంతకుముందు అయ్యప్పస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. పంచలోహ విగ్రహాల ప్రతిష్టాపన సందర్భంగా వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం నాడు వైయస్ జగన్ పులివెందుల లో ఉంటారు. మధ్యాహ్నం వరకు పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు. తర్వాత స్థానిక గ్రామాల్లో పర్యటిస్తారు.