309వ రోజు ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర

శ్రీకాకుళం: ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 309వ రోజు పాదయాత్రను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలకొండ శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి గోపాలపురం, మంగళపురం క్రాస్, నాగావళి బ్రిడ్జి మీదుగా బొడ్డవలస క్రాస్, సంకిలి, చిన్నయ్యపేట, మజ్జిరాముడుపేట మీదుగా ఉంగరాడమెట్ట వరకు పాదయాత్ర కొనసాగనుంది. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకొని ప్రజలంతా భారీ సంఖ్యలో తరలివచ్చారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు మోసాలతో విసిగి వేసారిపోయిన ప్రజలంతా తమ బాధను జననేతకు చెప్పుకునేందుకు తరలివస్తున్నారు. 
 
Back to Top