నీటి విడుదలను అడ్డుకుంటాం..!

వైఎస్సార్ జిల్లాః వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీరిస్తామనే ధైర్యం లేకనే శ్రీశైలం నుంచి నీటిని దిగువకు వదులుతున్నారని విమర్శించారు. వచ్చిన నీటిని వచ్చినట్లు కిందకు వదిలితే రాయలసీమ పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీశైలంలో రిజర్వాయర్ లో 854 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నీటిని అడ్డుకొని తీరుతామన్నారు.
Back to Top