- వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే సంకల్పంతో పార్టీలోకి
- ఎమ్మెల్యే అనిల్ సమక్షంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరిన యువకిశోరాలు
నెల్లూరుః వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే ధృడ సంకల్పంతో యువత ఉన్నారని, అందుకే ఆయన వెంట నడిచేందుకు సిద్ధపడుతున్నారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్‌యాదవ్ స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని 4వ డివిజన్ కిసాన్‌నగర్‌కు చెందిన యువత, మహిళలు పార్టీ బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి పాకాల లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ సమక్షంలో పెద్ద సంఖ్యలో వైయస్‌ఆర్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైయస్ జగన్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం అని గుర్తించిన యువత... ఆలోచన చేసి, వైయస్సార్సీపీని బలోపేతం చేసేందుకు పార్టీలో చేరడం జరిగిందన్నారు. మూడు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ. 2 వేల ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపానపోలేదన్నారు. నగరంలోని అన్ని డివిజన్‌లలో ఈ చేరికల పరంపర కొనగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ ద్వారకానాద్‌రెడ్డి, కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, రామవరపు రాజశేఖర్, ఎండీ ఖలీల్ అహ్మద్, గోగుల నాగరాజు, పార్టీ నాయకులు పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.