సాగునీటి రిజర్వాయిర్ల కోసం కృషి

రోలుగుంట: వర్షాధార మండలమైన రోలగుంటకు సాగునీటి రిజర్వాయిర్ల అవసరాన్ని గుర్తించానని వాటి ఏర్పాటుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే చోడవరం నియోజకవర్గం వైయస్సార్‌సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. మండలస్థాయి పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఆ పార్టీ మండలశాఖ ఆద్యక్షుడు పోతల లక్ష్మీ శ్రీనివాస్‌ శుక్రవారం స్థానిక పాత రామమందిరం కళ్యాణమండపం వద్ద నిర్వహించారు. ఇక్కడ ముఖ్య అతిధిగా పాల్గొన్న ధర్మశ్రీ మాట్లాడుతూ... డాంబికాలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమాలు ఆమలు చేయడంలో విఫలమయిందన్నారు. తాను మండలంలో నిర్వహించిన గడపగడపకు వైయస్సార్‌సీపీ కార్యక్రమాల్లో ఆర్హులైన వారు టీడిపి గ్రామ కమిటీల పెత్తనంతో అనర్హులమయ్యామని  తమ బాధలు చెప్పుకోవడం జరిగిందన్నారు. అలాగే తమ్ముడికి పింఛన్‌ ఇచ్చి అన్నకు  రాకుండా చేయడం విచారకరమన్నారు. అలాగే నీరు–చెట్టు పథకం పనుల పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.  ఎమ్మెల్యే రాజు ప్రజ సంక్షేమాలు పక్కన పెట్టి ఇస్టారాజ్యంగా ఖనిజ సంపద దోపిడీ ప్రయిత్నంలో ఉండడం దారుణమన్నారు. 

పింఛను బాధితుల న్యాయం కోసం త్వరలో మండల కార్యాలయం వద్ద ఆదోళన చేయాలని, అందుకు అందరూ సిద్ధం కావాలన్నారు. ఈ నెలాఖరున నియోజక వర్గం స్థాయిలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. అయితే ఎక్కడ నిర్వహించేది ఇంకా నిర్ణయం కాలేదన్నారు. తరువాత గ్రామాల వారీగా నాయకుల మాట్లాడుతూ పార్టీ అభివృద్దికి సంబంధించిన సూచనలు చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top