నల్ల జీవోను రద్దు చేయాలి: బత్తుల డిమాండ్

హైదరాబాద్: చేనేత కార్మికుల పాలిట శాపంగా మారిన నల్ల జీవో 12ని తక్షణం రద్దు చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి  కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వార్షికాదాయం రూ.6 వేలు ఉన్న చేనేత కార్మికులకు వర్తింపజేస్తున్న ఈ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం రూ.4వేలకి తగ్గిస్తూ ఈ నెల జీవోను ఇచ్చిందన్నారు. ‘త్రిఫ్ట్’ పతకానికి ఆదాయ పరిమితిని తగ్గించడం దారుణమన్నారు. ఆదాయ పరిమితిని రూ.12వేలో లేదా రూ.20 వేలకు పెంచాల్సింది పోయి తగ్గించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికే చేనేత కార్మికులు ఆకలితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఒక్క అనంతపురం జిల్లాలోనే 12 మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవోను మార్చడం నేతన్నల మరణాలను ప్రోత్సహించడమే అవుతుంద న్నారు. వార్షికాదాయం తగ్గిస్తే రోజువారి కూలీపై పనిచేసే పేద చేనేత కార్మికులకు పథకం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు.
Back to Top