రాబోయే ఎన్నికల నాటికి మరింతగా బలోపేతం

హైదరాబాద్ః
వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికలో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని తెలంగాణ
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఉపఎన్నికల్లో పార్టీ ఓటమికి సంబంధించి  హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ
కార్యాలయంలో ఇవాళ సమీక్ష జరిగింది. ఏవైనా ఒడిదొడుకులంటే వాటిని
సరిదిద్దుకొని రాబోయే ఎన్నికల నాటికి పార్టీని మరింతగా బలోపేతం చేయాలని
నిర్ణయించారు. 

వరంగల్ తో పాటు మిగతా
ప్రాంతాల్లోనూ ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున  వైఎస్సార్సీపీలో
చేరనున్నారని పొంగులేటి తెలిపారు. తెలంగాణలో  దివంగత ముఖ్యమంత్రి వైఎస్.
రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో రూపొందిన వైఎస్సార్సీపీకి ప్రజలు తప్పకుండా
దీవెనలు అందిస్తారని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమీక్షలో
పొంగులేటి, శివకుమార్, ఎడ్మ క్రిష్టారెడ్డి, నల్లా సూర్యప్రకాష్ సహా
జిల్లాల నేతలంతా పాల్గొన్నారు. 
Back to Top