అసత్య ప్రచారాలు మానుకోండి..! ఎస్వీ మోహన్ రెడ్డి

హైదరాబాద్: కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొన్ని టీవీ చానెళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని కర్నూలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. వెంటనే దీనికి సంబంధించిన సవరణ వార్తల్ని ప్రసారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన  మీడియాతో మాట్లాడారు.

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ కి,  కాంగ్రెస్, ఎమ్ఐఎమ్ సభ్యులతో పాటు ఇండిపెండెంట్లు కూడా మద్దతు ఇస్తున్నారని మోహన్ రెడ్డి వెల్లడించారు. స్పష్టమైన ఆధిక్యం వైఎస్సార్సీపీ కి ఉందని ఆయన వివ రించారు. అయినాసరే, పోలీసుల్ని రంగంలోకి దింపి, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను భయపెడుతున్నారని మోహన్ రెడ్డి ఆరోపించారు. బస్లుల్లోకి ఎక్కించుకొని క్యాంపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో అక్రమ మార్గాల ద్వారా గెలిచేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆయన వివరించారు. ఇటువంటి ్రపలోభాలు ఏమాత్రం పనిచేయవని, వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలవటం తథ్యమని మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Back to Top