అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అగ్రిగోల్డు బాధితులకు 11 వందల కోట్లు

రూ.20 లక్షల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు ఏవీ బాబూ?

చీపురుపల్లి బహిరంగ సభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి

 చీపురుపల్లి : అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అగ్రి గోల్డు
బాధితులను ఆదుకోడానికి 11 వందల కోట్లను విడుదల చేసి ఆదుకుంటానని ప్రతిపక్ష నేత
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మహానేత వైయస్ ఆర్ హాయంలో 90-95 శాతం పైగా
పూర్తయిన ప్రాజెక్టు పనులను తానే చేయించానంటూ ప్రచారం చేసుకోవడం తప్ప,
ప్రాజెక్టులను పూర్తి చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం
చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో వైయస్ జగన్
ప్రసంగిస్తూ, చంద్రబాబు ప్రభుత్వ తీరును, అక్రమాలను ఎండగట్టారు.  

తానే తోటపల్లి కట్టినట్టు చంద్రబాబు పోజులు కొడుతున్నాడని
ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ దుయ్యబట్టారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి
హయాంలో 95 శాతం పనులు పూర్తయి పరుగులు పెట్టిన తోటపల్లి ప్రాజెక్టు
చంద్రబాబు హయాంలో మిగిలిన 10 శాతం పనులు నత్తనడకన సాగాయన్నారు. లక్ష 35 వేల ఎకరాలు
సాగులోకి రావాల్సివుందని కనీసం 80వేల ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదన్నారు.  కొత్త ప్రాజెక్టులు రావడం కాదుకాదా కనీసం ఉన్న ప్రాజెక్టులు ఉపయోగంలోకి రావడంలేదన్నారు.

విశాఖపట్నంలో మీటింగ్‌ పెట్టి రూ.  20 లక్షల కోట్లు
పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షలు ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు  డబ్బాలు
 కొడతారని కాని పరిస్థితి చూస్తే  ఉన్న  ఉద్యోగాలు పోతున్నాయని మండిపడ్డారు.   40 లక్షలు ఉద్యోగాలంట మీకు ఎక్కడైన
కనిపించాయా అని ప్రజలను ప్రశ్నించగా,  లేదంటూ
పెద్ద ఎత్తున నినాదాలతో సమాధానమిచ్చారు.

రాష్ట్రంలో  35 ఫెర్రో ఎల్లాయిస్‌
సంస్థలుంటే  విజయనగరం జిల్లాలోనే 16 ఉన్నాయి వాటిలో చీపురుపల్లిలోనే ఆరు ఉన్నాయి.
వీటి పరిస్థితి ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత  16లో  5 కంపెనీలు మూతపడగా, చీపురుపల్లిలో ఆరు
సంస్థలకు మూడు మూతపడ్డాయని వివరించారు.

 2009లో వైయస్‌ఆర్‌
పాలనలో ఫెర్రో ఎల్లాయిస్‌ సంస్థలకు కరెంటు చార్జీలు  2.65 పైసలయితే,  చంద్రబాబు పాలనలో 5.37 పైసలకు పెంచారని
మండిపడ్డారు.  జిల్లాలో  34 జ్యూట్‌ మిల్లులు ఉంటే 16 మూతపడే పరిస్థితి ఉందన్నారు.  వైయస్‌ఆర్‌ హయాంలో జ్యూట్‌మిల్లులకు 3.15పైసలకు ఇస్తే. అదే చంద్రబాబు హయాంలో 8 రూపాయలకు సరఫరా చేస్తున్నారన్నారు.
జ్యూట్‌మిల్లులు మూతపడే  పరిస్థితుల్లో,వాటిలోని ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడాల్సివస్తోంది.  వలసలు పెరిగిపోతున్నాయన్నారు.  వాస్తవాలు ఇలా ఉంటే  చంద్రబాబు మాత్రం 20 లక్షల పెట్టుబడులు వచ్చాయి. 40 లక్షల ఉద్యోగాలు
అని పోజులు కొడతాడని ఎండగట్టారు.

 అధికారంలోకి వచ్చిన
ఆరునెలలలోపు అగ్రిగోల్డ్‌ సమస్య పరిష్కారిస్తా...

 రాష్ట్ర్రంలో 9 లక్షలు అగ్రిగోల్డ్‌ బాధితులు ఉంటే  అత్యధికంగా
ఉత్తరాంధ్రలో బాధితులు ఎక్కువగా ఉన్నారని జననేత అన్నారు. అగ్రిగోల్డ్‌లో డబ్బులు పెట్టి , సకాలంలో తిరిగి రాక అనేక మంది
ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.  అగ్రిగోల్డ్‌
ఆస్తులు ఒకవైపు చంద్రబాబు తమ బినామీలతో కాజేస్తున్నారని ధ్వజమెత్తారు.  అగ్రిగోల్డ్‌ ఆస్తుల్లో అత్యంత విలువైన వాటిని
ఒక పద్దతి ప్రకారం పక్కన  పెట్టేయడమే
కాకుండా,  వేలానికి వచ్చే ఆస్తుల రేట్లను
తగ్గించి దోచేసేందుకు ప్రయత్నాలు 
చేస్తున్నారని ఎండగట్టారు.

 ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి తాండ్ర పాపా రాయుడులా
బిల్డప్‌ ఇచ్చాడని, చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి చేసిందేమిటీ అర్ధరాత్రి దాటిన తర్వాత అమర్‌సింగ్‌ను
పిలుపించుకుని అగ్రిగోల్డ్‌ ఆస్తులను తక్కువరేటుకు ఎలా కొనుగోలు చేయాలన్న దానిని
వివరించి చెప్పి బ్రోకర్‌ పనులు చేశారని బాబు వ్యవహారశైలిని బహిర్గతం చేశారు.
అగ్రిగోల్డ్‌ ఆస్తులు బహిరంగ మార్కెట్లో 35వేల కోట్లు విలువైన ఆస్తులన్ని ఒక
వైపు చెప్పి..సిఐడి చేత దర్యాప్తు చేయించి 10వేల కోట్ల రూపాయలకు
తగ్గించివేశారన్నారు.  ఎవరికైతే
విక్రయించాలనుకున్నారో ఆ సంస్థ కేవలం 2వేల రెండువందల కోట్లకు కొంటామని
ముందుకొచ్చిన పరిస్థితి. ఇలా అగ్రిగోల్డ్‌ ఆస్తులను చిల్లరకు,బిస్కెట్లకు
అమ్మేసుకునేందుకు ఆరాటపడుతున్నారన్నారు.  అగ్రిగోల్డ్‌కు
సంబంధించి గతంలో చంద్రబాబును అసెంబ్లీలో నిలదీశాను. 11 వందల కోట్లు
రూపాయలు ఇస్తే 80శాతం అగ్రిగోల్డ్‌ బాధితులకు ఉపమశనం కలుగుతుందని చెప్పాననీ. 11 వందల కోట్లు
ఇచ్చేందుకు మీకేమైనా బరువా అని చంద్రబాబును ప్రశ్నించినా స్పందించలేదని ఆగ్రహం
వ్యక్తం చేశారు.

 అగ్రిగోల్డ్‌ బాధితులకు అందరికి హామీ ఇస్తున్నా..దేవుడి
ఆశీర్వదించి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ అనే నేను ఆరునెలల్లో 11 వందల కోట్లు ఇచ్చి
80శాతం బాధితులకు ఉపశమనం కలిగిస్తానని ప్రకటించారు. అగ్రిగోల్డ్‌
ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ముక్కలుగా చేసి ఆస్తులను విక్రయించి
అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇస్తామన్నారు.అదేవిధంగా ఫేర్రో ఎల్లాయిస్‌ కంపెనీలు, జ్యూట్‌ మిల్లుల
ఉద్యోగులకు, కార్మికులను తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.


Back to Top