పార్టీ బలోపేతం కోసం కృషి చేద్దాం

జగ్గంపేట: ఎన్నికల హామీలు నెరవేర్చేలా చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. శుక్రవారం జగ్గంపేటకు వచ్చిన పార్థసారధి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఒమ్మి రాఘురామ్‌తో భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ విషయాలపై పార్థసారధి రఘురామ్‌తో చర్చించారు. పార్టీ బలోపేతం దిశగా నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. పార్టీ విజయానికి చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించారు. అనంతరం  ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జరిగే యాదవ మహాసభకు హాజరయ్యేందుకు పార్థసారధి బయల్దేరి వెళ్లారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ నేత ఒమ్మి నూకరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top