రైతు రుణాల రీ షెడ్యూల్‌కు ఒత్తిడి తెస్తాం

ఏలూరు, 28 అక్టోబర్ 2013:

అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల రుణాలను రీ షెడ్యూల్‌ చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని వైయైస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదారు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల, వరదల కారణంగా పంటలు పాడైపోయిన అన్నదాతలను ఆమె సోమవారం ఓదార్చారు. జిల్లాలోని నారాయణపురంలో ఆమె పర్యటించారు. వర్షాలు, వరదలతో మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు‌ చొప్పున తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల‌కు వెంటనే సాయం అందించి ఆదుకోవాలన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మహానతే వైయస్ రాజశేఖరరెడ్డి‌ హయాం నాటి సువర్ణయుగం మళ్ళీ వస్తుందని శ్రీమతి విజయమ్మ బాధితులకు భరోసా ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top