రైతు కుంటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే విశేశ్వర్‌రెడ్డి

బెళుగుప్ప: మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామంలో సోమవారం ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందిన  చిలకల రామాంజనేయులు(45) మృతదేహానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డిలు నివాళులు అర్పించారు. పార్టీ మండల నాయకులతో కలసి గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులైన భార్య లక్ష్మీదేవి, కుమారుడు సూరిలను  పరామర్శించి మృతికి గత కారణాలను అడిగి తెలసుకున్నారు. ఉరవకొండలో నిర్వహించిన రైతు మహాధర్నా కార్యక్రమానికి సైతం గ్రామంలోని నాయకులతో కలసి రామాంజనేయులు హాజరయ్యారని చెప్పారు. మృతుడి కుటుంబానికి అండగా వుంటామని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు భరోసా ఇచ్చారు.
Back to Top