విశాఖ యువభేరికి వైఎస్ జగన్..!

వైఎస్ జగన్ కు మద్దతుగా కదం తొక్కుతున్న విద్యార్థిలోకం ..
సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవనున్న ప్రతిపక్షనేత..!
ప్రత్యేకహోదా సాధన కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా విద్యార్థిలోకం కదం తొక్కుతోంది. తిరుపతి యువభేరి అందించిన స్ఫూర్తితో  విశాఖలో 22న విద్యార్థి యువభేరి నిర్వహిస్తున్నారు. ఈసదస్సుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతుండడంతో యువత రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తోంది.  వైఎస్ జగన్ రాక కోసం విద్యార్థులు, యువత ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రత్యేకహోదా ప్రాముఖ్యతను తెలియజెప్పేందుకు వస్తున్న వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.  

వైఎస్ జగన్ అలుపెరగని పోరు..!
ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ ఉద్యమిస్తున్న తీరు ప్రతిఒక్కరినీ మేలుకొలుపుతోంది.  స్పెషల్ స్టేటస్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ అందరినీ ఐక్యం చేస్తూ ముందుకు సాగుతున్న జననేతకు జనం నీరాజనం పలుకుతున్నారు. ప్రత్యేకహోదాపై విద్యార్థులను చైతన్యపరిచేందుకు విశాఖ వేదికగా  వైఎస్ జగన్ మరోసారి తమ గళం వినిపించబోతున్నారు. తిరుపతి యువభేరి విజయవంతమైనట్టుగానే విశాఖ యువభేరిని సక్సెస్ చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రత్యేకహోదాపై మేలుకొలుపు..!
విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో జరగనున్న విద్యార్థి యువభేరి సదస్సుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు. ప్రత్యేకహోదా సాధనలో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన ఆవశ్యకతపై  విద్యార్థులు,యువతతో చర్చిస్తారు.  ప్రత్యేకహోదా వల్ల కలిగే ప్రయోజనాలను కూలంకషంగా వివరిస్తారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్  అందక విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇటీవల విశాఖలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్  తదితర అంశాల్లో ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వైఎస్ జగన్ ఎండగడతారు.   

Back to Top