విశాఖపట్నంలో జగన్ కోసం 'జనం సంతకం'

విశాఖపట్నం: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డిని జైలులో అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ విశాఖపట్నంలో కోటి సంతకాల సేకరణ ప్రారంభమైంది.  శ్రీ జగన్‌పై కుట్రలకు వ్యతిరేకంగా 'జనం సంతకంస పేరుతో కోటి సంతకాలు సేకరించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో కోటి సంతకాల సేకరణ శనివారం మొదలైంది. వైయస్‌ అభిమానులు, పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై రాజకీయంగా బనాయించిన కేసులను తీవ్రంగా గర్హిస్తున్నామని ఈ సందర్భంగా పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు ఖండించారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా కేంద్రంలోని కొందరు‌ పెద్దలు అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా పలువురు మండిపడ్డారు. శ్రీ వైయస్ జగ‌న్‌ను అన్యాయంగా జైల్లో పెట్టారని విమర్శించారు.‌ సేకరించిన కోటి సంతకాలను రాష్ట్ర గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిస్తామని శ్రీ జగన్ అభిమానులు ‌పేర్కొన్నారు.


తాజా వీడియోలు

Back to Top