పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వినాయ‌క చ‌వితి పూజ‌లు

హైద‌రాబాద్‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన‌ గణేశ్ మండపం వ‌ద్ద ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మొద‌టి పూజ చేశారు. అనంత‌రం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు   స్వామివారిని ద‌ర్శించి పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వినాయ‌క చ‌వితి పండుగ భారతీయ సంస్కృతికి అద్దం పడుతూ.. ఆణిముత్యాలతో కూడిన హారంలా ప్రకాశిస్తూ, మన సంస్కృతిని ప్రతిబింబింపజేస్తాయ‌న్నారు. అంత‌టి విశిష్టమైన వినాయకచవితి సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాలకు అభివృద్ధి పరంగా విఘ్నాలు తొలగిపోయి అన్నీ విజయాలే సిద్ధించాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని పూజ‌లు చేశారు. అందరూ భక్తి శ్రద్ధలతో ఈ పండుగను వేడుకగా జరుపుకోవాల‌ని దేవున్ని ప్రార్థించిన‌ట్లు సుబ్బారెడ్డి తెలిపారు. కార్య‌క్ర‌మంలో ఏపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి పుత్తా ప్ర‌తాప్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కొండా రాఘ‌వ‌రెడ్డి, ఏపీ స్టేట్ సెక్ర‌ట‌రీ భ‌వ‌నం భూష‌న్‌, నాయ‌కులు బి.మోహ‌న్‌, సిద్ధారెడ్డి, ర‌మ‌ణారెడ్డి, శ్రీ‌నివాస్‌రెడ్డి, సుంద‌ర్‌, రాఘ‌వ‌నాయుడు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top