దోపిడీ సొమ్మును విదేశాలకు తరలించేందుకే

రాజన్న పాలనలో చంద్రబాబు కుటుంబం లబ్ది 
గిరిజనులకు తోడుగా వైఎస్ జగన్

చింతపల్లి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎల్లప్పుడూ గిరిజనులకు బాసటగా ఉంటారని పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకోసం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో వైఎస్సార్సీపీ నిర్వహించిన బహిరంగ సభలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంతో పాటు గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు మన్యం ప్రజలకు అండగా వైఎస్ జగన్ పోరాడుతారని చెప్పారు. 

స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో ఎంతో చేశారని, సమైక్య రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రకంగా మేలు చేకూర్చారని విజసాయిరెడ్డి ఈసందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం కూడా రాజన్న పాలన ద్వారా లబ్ధి పొందిందని అన్నారు. ఆదివాసీల డిమాండ్ ఏమిటో ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పడంతోపాటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా  వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.

బాక్సైట్ ను అమ్ముకొని లక్షల కోట్లు గడించాలన్న దురుద్దేశ్యంతోనే చంద్రబాబు జీవో 97 తీసుకొచ్చారని విజయసాయిరెడ్డి అన్నారు. అలా కొల్లగొట్టిన ధనాన్ని విదేశాలకు తరలించాలని చూస్తున్నారని మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాల వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలు నాశనమయ్యే ప్రమాదముందన్నారు. బాక్సైట్ తవ్వకాలు పర్యావరణానికి,  ఏజెన్సీ ప్రాంతానికి మంచిది కాదని విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి హితవు పలికారు.  మైనింగ్ ను వ్యతిరేకించి పోరాటం సాగించాల్సిన అవసరం మనపై ఎంతైనా ఉందని మన్యం ప్రజలకు పిలుపునిచ్చారు. 
Back to Top