కాకినాడను మురికికూపంగా మార్చారు

తూర్పుగోదావరిః కాకినాడను స్మార్ట్ సిటీగా చేస్తామని చెప్పి చంద్రబాబు మురికికూపంగా మార్చారని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కాకినాడ అభివృద్ధి కోసం వైయస్సార్సీపీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారు. పెట్రోలియం యూనివర్సిటీ, ఉపాధి కల్పన, పారిశుధ్యం వంటివి వైయస్సార్సీపీ ప్రాధాన్యత అంశాలని అన్నారు. కాకినాడ అభివృద్ధిపై స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు పేర్కొన్నారు.

Back to Top