ప్రజల ఆకాంక్ష మేరకే విజయమ్మ సమరదీక్ష

శ్రీకాకుళం :

ప్రజల మనోభావాలకు అనుగుణంగానే వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ‌నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారని పార్టీ సీఈసీ సభ్యుడు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. శ్రీహతి విజయమ్మ నిరాహార దీక్షకు మద్దతుగా శ్రీకాకుళంలో పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, వరుదు కల్యాణి, బొడ్డేపల్లి పద్మజతో పాటు ఇతర మహిళా ప్రతినిధులు సోమవారం ఒకరోజు రిలే నిరాహార దీక్ష చే‌శారు. ముందుగా మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి ధర్మాన కృష్ణదా‌స్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఏ విధమైన శాస్త్రీయత లేకుండా రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని కృష్ణదాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నా, సమైక్యాంధ్రపై వైయస్ఆర్‌ కాంగ్రెస్ ముందు‌ నుంచీ తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించిందని చెప్పారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి, శ్రీమతి విజయమ్మతో పాటు 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారన్నారు. ఇతర పార్టీల నాయకులు కూడా రాజీనామా చేసి సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని‌ కృష్ణదాస్ డిమాండ్ చేశారు.

‌పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ మాట్లాడుతూ‌.. చంద్రబాబు, టిడిపి, కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కళ్యాణి మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తామని కాంగ్రెస్, ‌టిడిపి నాయకులు చెబుతున్నా స్పీకర్ ఫార్మా‌ట్‌లో రాజీనామాలు ఇవ్వలేదన్నారు.

కాగా, రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని లేకపోతే సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ శ్రీమతి విజయమ్మ చేస్తున్న సమరదీక్షకు ప్రజలు, పార్టీ శ్రేణులు కదిలి రావాలని ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ‘కదిలిరండి సమైక్యంగా విజయమ్మ ఆమరణ దీక్షకు’ పోస్టర్‌ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు.

Back to Top