టీడీపీ గూండాల దాడి అమానుషం


గుంటూరు జిల్లా
నర్సరావుపేటలో చంద్రబాబు నాయుడు సభలో గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులపై టీడీపీ గుండాలు దాడి చేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది.
దీనిపై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని పార్టీ ప్రధాన
కార్యదర్శి విజయసాయి రెడ్డి డిమాండ్ 
చేశారు. ఎన్నికలకు ముందు బాబు వస్తేనే జాబు వస్తుందని, ఇంటికో ఉద్యోగం
ఇప్పిస్తానని నమ్మించి మాట తప్పారని.. ఈ రోజు చివరకు దిగజారిపోయి తన సభలో తన కళ్ల
ఎదుటే.. తన కార్యకర్తలతోనే .. ఉద్యోగాలు అడగటమే నేరం అన్నట్లుగా దాడులు చేయించరాని
ఆయన దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని, గూండాస్వామ్యం అని ఆయన అబివర్ణించారు. 

Back to Top