శ్రీకాకుళం: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి శ్రీకాకుళం జిల్లాలో ఘన స్వాగతం లభించింది. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల భారీ ర్యాలీ మధ్య వైయస్ జగన్ రణస్థలం మండలం చేరుకున్నారు. వైయస్ జగన్ సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి వరద రామారావు, విజయనగరం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైయస్‌ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు వైయస్ జగన్ వాసిరెడ్డి వరద రామారావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పార్టీలో చేరికల కార్యక్రమాలు ఉంటాయని, సాయంత్రం 4 గంటలకు వైయస్ జగన్ వంశధార 13 గ్రామాల నిర్వాసితులతో మాట్లాడన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, అక్రమాలను నిలదీయడం, అర్హులైన నిర్వాసితులకు చట్టప్రకారం రావాల్సిన నష్టపరిహారం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నారు. వైయస్ జగన్ వెంట పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, కోలగట్ల వీరభద్రస్వామి, రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్ తదితరులు ఉన్నారు. <br/>