27న ఢిల్లీలో వంచనపై గర్జన..

విజయవాడః ఈ నెల 27న ఢిల్లీ వేదికగా వంచపై గర్జన దీక్ష నిర్వహిస్తునట్లు వైయస్‌ఆర్‌సీపీ నేతలు బొత్స సత్యనారాయణ,సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.ఢిల్లీ దీక్షకు అన్ని జిల్లాల నేతలు,సమన్వయకర్తలు హాజరవుతారన్నారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా,విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చడంలో మోసం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర  ప్రభుత్వాల తీరుకు నిరసనగా పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 27న ఢిల్లీలో వైయస్‌ఆర్‌సీపీ దీక్ష చేపట్టనుంది. ఈ దీక్షలో పార్టీ ముఖ్యనేతలు,ఎంపీలు,మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,రాష్ట్ర నాయకులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు,పార్టీ శ్రేణులు పాల్గొంటాయన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top