వైయస్ హయాంలోనే దళితుల అభివృద్ధి

కోడేరు:

దివంగత మహానేత డాక్టర్  వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే  దళితులు, క్రైస్తవులు అభివృద్ధి చెందారని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశరావు పేర్కొన్నారు.  క్రైస్తవుల అభివృద్ధి కోసం మహానేత డాక్టర్ వైయస్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి వారి అభ్యున్నతికి పాటుపడ్డారని కొనియాడారు. ఆయన అకాలమరణం తర్వాత క్రైస్తవులు, దళితులను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కోడేరు బేతేలు గాస్మేల్ చర్చి ఆధ్వర్యంలో ఏర్పాటైన సెమీక్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కవయ్యాయనీ, ఇటీవల విజయనగరం జిల్లా లక్ష్మీపేటలో ఐదుగురు దళితులు హత్యకు గురైనా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటనీ ధ్వజమెత్తారు. డాక్టర్ వైయస్ పథకాల అమలు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికే  సాధ్యమవుతుందనీ, ఆయనను ముఖ్యమంత్రి చేసేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారనీ చెప్పారు. జగన్‌ను జైల్లో పెట్టినంత మాత్రాన ప్రజలనుంచి దూరం చేయలేరని తేల్చిచెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top