వైయస్ఆర్‌సిపి రక్తదాన శిబిరాలకు భారీ స్పందన

హైదరాబాద్, 1 అక్టోబర్‌ 2012: జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారంనాడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నారాయణగూడలో ఉన్న వైయంసిఎ గ్రౌండ్సులో నిర్వహిస్తున్న శిబిరంలో పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలు, ఐటి ఉద్యోగులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం నారాయణగూడలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నాయకులు బాజిరెడ్డి గోవర్దన్‌, గట్టు రామచంద్రరావు, కొల్లి నిర్మలాకుమారి, విజయారెడ్డి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ‌శివభార‌త్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసిన వారికి పార్టీ నాయకులు పండ్ల పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా మేకపాటి మాట్లాడుతూ, రక్తదానం మొత్తం రాష్ట్రం అంతటా అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. బంద్‌ లేకపోతే ఇంకా విశేష స్పందన వచ్చి ఉండేదన్నారు. డాక్టర్‌ శివభారత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైయస̴్ఆర̴్ కాంగ్రెస్‌ పార్టీ వైద్య విభాగం చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా, క్యాన్సర్, తలసేమియా, గర్భిణులకు మన రాష్ట్రంలో రక్తం కొరత ఎక్కువగా ఉందని శిబిరం నిర్వాహకుడు శివభారత్‌ రెడ్డి తెలిపారు. మన దేశంలో నాలుగు కోట్ల యూనిట్ల రక్తం అవసరం ఉంది. అయితే, కేవలం 40 లక్షల యూనిట్లే అందుబాటులో ఉంది. ప్రజల్లో అవగాహన లేకపోవడమే ఈ కొరతకు కారణమన్నారు. రక్తం ఇస్తే తమకు ఏదో అయిపోతుందన్న అపోహే దీనికి కారణమన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైద్య విభాగం ఆధ్వర్యంలో భవిష్యత్తులో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
బాజిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో డెంగ్యూ, ఇతర వ్యాధులు సోకినప్పుడు రక్తం లేక చాలామంది మరణిస్తున్నారని, ప్రాణాంతక వ్యాధులు సోకినప్పుడు రక్తం అందుబాటులో లేక చాలా మంది గిరిజనులు, దళితులు, బలహీన వర్గాల వారు రక్తం లేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయారెడ్డి కూడా మాట్లాడారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రక్తదాన‌ం శిబిరం పిలుపునకు విశేష స్పందన వస్తోంది. పార్టీ కార్యకర్తలే కాకుండా అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. వైయస్‌ఆర్ జిల్లా కడపలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో పార్టీ నాయకుడు వై‌యస్ వివేకానందరెడ్డి‌ పాల్గొన్నారు. ఆయన కూడా స్వయంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ పండ్లు పంపిణీ చేసింది.
రక్తదానం చేసిన అనంతరం వివేకానందరెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి ప్రజా సేవా కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పార్టీ పిలుపు మేరకు రక్తదానం చేయడానికి తమ కడపలో కనీసం 200 మంది కార్యకర్తలు వచ్చారని అభినందించారు. స్వచ్ఛందంగా వారు ఇలాంటి ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. తమ అందరికీ స్ఫూర్తి ‌ప్రదాత జగన్‌రెడ్డికి తొందరగా బెయిల్ రావాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామన్నారు.



తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top