<strong>హైదరాబాద్, 23 డిసెంబర్ 2012:</strong> ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటి విభాగం మౌన నిరసన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్సు చెక్‌పోస్టు వద్ద ఆ విభాగం ప్రతినిధులు ఆదివారంనాడు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌లతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ వారు మౌనంగా నిరసన తెలిపారు. ఢిల్లీ రేప్ ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలని పార్టీ ఐటి విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస̴్ఆర్‌సిపి ఐటి విభాగం ప్రతినిధులతో పాటు పలువురు విద్యార్థినులు కూడా పాల్గొని నిరసన తెలిపారు.<br/>