వైయస్ఆర్ సీపీతోనే ప్రజలకు న్యాయం

చిత్తూరు:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు సమన్యాయం సాధ్యమని ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఏయస్.మనోహర్ పేర్కొన్నా రు. గడపగడపకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నగరంలోని కట్టెల దొడ్డి, జయనగర్ కాలనీ, పోలీసు క్వార్టర్సులో పార్టీ నేతలు పర్యటించారు. మనోహర్ మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి మరణంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా చచ్చిపోయిందని అన్నారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న టీడీపీని బతికించడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆపసోపాలు పడుతున్నారని విమర్శించారు. పాదయాత్ర పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. ఆయన తలకిందులుగా తపస్సు చేసినా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బందు లు పెడుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజ లు గమనిస్తున్నారని, దీనికి ప్రతీకారంగా వచ్చే ఎన్నికల్లో తీర్పు ఇవ్వనున్నారని పేర్కొన్నారు. వైఎస్ హయాం నాటి స్వర్ణయుగం మళ్లీ రావాలంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ చిత్తూరు నగర కన్వీనర్ పూల రఘునాథరెడ్డి, జిల్లా కమిటీ నేత లు అమర్, ప్రసాద్, రెహమాన్, గులాబ్, శంకర్, సయ్యద్, కార్యకర్తలు రామమూర్తి, ప్రేమ్‌నాథ్ పాల్గొన్నారు.

జనం వైయస్ఆర్ సీపీ వైపే: నారాయణ స్వామి

పుత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలులో ఉన్నా, రాష్ట్ర ప్రజలంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి పేర్కొన్నారు. ఆయన పుత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే శక్తి లేకనే అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మకై చీకటి రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సుప్రీంకోర్టులో జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ వస్తుందని తాము భావించామని, అయితే రాకపోవడం బాధ కలిగించిందన్నారు.  కాంగ్రెస్‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ విలీనమవుతుందని మాట్లాడిన నేతలు ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల ప్రజల ముఖంలో చిరునవ్వు చూడాలని కలలు కన్నందుకు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినా అధైర్య పడకుండా ధైర్యంగా ముందుకెళదామని జగన్‌మోహన్‌రెడ్డి సందేశం ఇవ్వడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. సోనియా గాంధీ అల్లుడు  వాధ్రాపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలగురించి సమగ్ర విచారణ జరపకుండా ప్రతిపక్ష పార్టీకి చెందిన చంద్రబాబునాయుడు పంపిన ఎంపీలతో చిందంబరం రహస్య భేటీ ఏమిటని ప్రశ్నించారు.

Back to Top