వైయస్‌ఆర్‌ సీపీలోకి టిడిపి, కాంగ్రెస్‌ శ్రేణులు

కరీంనగర్‌, 26 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా శుక్రవారం నాడు కరీంనగర్‌ జిల్లాకు చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు చెందిన కార్యకర్తలు వైయస్‌ఆర్‌ సిపిలో చేరారు. కరీంనగర్‌ జిల్లా కాటారం మండల పరిధిలోని ఆయా పార్టీల కార్యకర్తలు తమ పార్టీలకు గుడ్‌బై చెప్పారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ జిల్లా కన్వీనర్‌ పుట్టా మధు సమక్షంలో వారంతా వైయస్‌ఆర్‌ సిపిలో చేరారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పట్ల ప్రజల్లో అమితమైన ప్రేమ, అభిమానం ఉన్నాయని, ఆయనకు ప్రజాబలం ఉన్నదని ఈ సందర్భంగా మాట్లాడిన వారు పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top