వైయస్ఆర్ సీపీలోకి భారీగా వలసలు

మదనపల్లె: మదనపల్లె నియోజకవర్గంలో వైయస్ఆర్ సీపీలోకి టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా క్యూ కడుతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే వందలాది మంది ఆయా పార్టీలను వీడి జై జగన్ అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మదనపల్లె రూరల్ పరిధిలోని పొన్నూటిపాళెంలో జరిగిన గడపగడపకూ వైయస్ఆర్ సీపీ కార్యక్రమంలో దాదాపు 200 మంది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పొన్నూటిపాళెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ వరుస విజయాలను చూసి భయపడిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి వెనకడుగు వేస్తోందన్నారు. స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయన్నారు. ఈ కారణంగా పల్లెలు, మున్సిపాలిటీలలో సమస్యలు తిష్టవేశాయని చెప్పారు. 2014 ఎన్నికల్లో జగన్‌మో హన్‌రెడ్డిని సీఎం చేస్తేనే పల్లెసీమలు తిరిగి పచ్చదనంతో కళకళలాడతాయని, ఇందుకోసం పార్టీలోని ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపు నిచ్చారు. గ్రామంలో నీటి సమస్యతో తాము తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన తన సొంత నిధులతో గ్రామంలో త్వరలోనే బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్పీ తిప్పారెడ్డి టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ముఖ్యులలో పొన్నూటిపాళెం మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, నారాయణరెడ్డి, రమణారెడ్డి, రెడ్డెప్ప, శివకుమార్‌రెడ్డి, ఆనందరెడ్డి, పలసమాకులపల్లెకు చెందిన భాస్కర్‌రెడ్డి, ప్రతాప్, మంజునాథ, సురేంద్ర, రామాంజులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో 200 మందికిపైగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు వైఎస్సార్ సీపీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రామసముద్రం మండల పరిశీలకుడు జగన్నాథరెడ్డి, పట్టణ కన్వీనర్ సురేంద్ర, మైనార్టీ నాయకుడు అక్తర్‌అహమ్మద్, అంబేద్కర్ చంద్రశేఖర్, కోటూరి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

వైయస్ఆర్‌ సీపీలో ముస్లింల చేరిక
హైదరాబాద్: అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన ముస్లింలు పెద్ద సంఖ్యలో సోమవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కదిరి నుంచి ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్‌కు తరలి వచ్చిన మైనారిటీలు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎం.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ హెచ్.ఏ.రెహ్మాన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ముస్లింల జనాభా గణనీయంగా గల కదిరి నుంచి పెద్ద సంఖ్యలో పార్టీలోకి రావడం సంతోషదాయకమని పార్టీ నేతలు పేర్కొన్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి మేకపాటి ఆహ్వానించారు. వీరితో పాటుగా టీడీపీ నేతలు రాజిరెడ్డి, రామాచారి కూడా పార్టీలో చేరారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ ఎం.శంకరనారాయణ అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి మహ్మద్ షాకీర్, మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య, ఇస్మాయిల్, బీసీ నాయకుడు మీసాల రంగన్న, కదిరి పార్టీ కోఆర్డినేటర్ జి.వి.సుధాకర్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వై.మధుసూదన్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నల్లచెర్వు మాబు, మాధురి రాజారెడ్డి, కుర్లి శివారెడ్డి, కదిరి టౌన్ కన్వీనర్ చాంద్ బాష, మండల పార్టీ కన్వీనర్లు ఎల్. లోకేశ్వర్ రెడ్డి, రమేష్‌నాయుడు, బైక్ భాస్కర్‌రెడ్డి, దామోదర్ రెడ్డి, నల్లచెర్వు యువజన నా యకుడు రవికుమార్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శివారెడ్డి, జిల్లా పార్టీ ట్రేడ్ యూని యన్ అధ్యక్షుడు హుస్సేన్ పీరాన్, కార్యదర్శి బయ్యప్ప, సేవాదళ్ పట్టణ అధ్యక్షు డు ఎహసాన్, యువజన విభాగం మం డల కన్వీనర్లు నీలకంఠారెడ్డి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Back to Top