వైయస్ఆర్ సీపీలో చేరికలు

టీఆర్‌ఎస్ యువసేన సభ్యుల చేరిక

సిరిసిల్ల రూరల్: సిరిసిల్ల మండలం చిన్నలింగాపూర్‌కు చెందిన టీఆర్ ఎస్ యువసేన సభ్యులు 30మంది గురువారం వైయస్సార్‌సీపీలో చేరారు. యువజన విభాగం నాయకుడు బైరినేని రాము ఆధ్వర్యంలో తంగళ్లపల్లిలోని పార్టీ కార్యాలయంలో చేరారు. పార్టీ నియోజకవర్గ నాయకులు బుస్స వేణు, జలగం ప్రవీణ్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్సార్ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే కేటీఆర్ మానసపుత్రిక అయిన టీఆర్‌ఎస్ యువసేన.. ఇసుక సేన అనే విషయం తెలియక యువకులు అందులో చేరారన్నారు.
ఎమ్మిగనూరులో..: పెద్దకడబూరు మండలం కంబదహాల్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు గురువారం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బచ్చాల రంగన్న, రామాంజనేయులు, గుండాల ఆంజినయ్య, మేకల నల్లప్ప, రామయ్యగారి కిష్టప్ప, శ్రీనివాసులతోపాటు 50 మంది కార్యకర్తలు ఎమ్మిగనూరులోని భీమా భవన్‌లో ఉన్న ఎమ్మెల్యేను కలిసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పెద్దకడబూరు మండలం వైఎస్సార్సీపీ నాయకులు రెడ్డి పురుషోత్తంరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, చిన్నతుంభళం రమేష్, కాంతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రానున్నది రాజన్న రాజ్యం
నాయుడుపేట టౌన్: రాష్ట్రంలో రాజన్న రాజ్యం మరలా రానుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నాయుడుపేట మండలం మేనకూరు పంచాయతీలోని వద్దిగుంట కండ్రిగ గ్రామస్తులు అనేకమంది గురువారం వైయస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కాకాణి మాట్లాడారు. మహానేత వైయస్సార్ ప్రవేశపెట్టినన్ని పథకాలు ఏ ముఖ్యమంత్రి కూడాప్రవేశపెట్టలేక పోయారని కచ్చితంగా చెప్పొచ్చన్నారు. మహానేత ఆశయాలు నెరవేరాలంటే జగన్‌మోహన్‌రెడ్డికే పట్టం కట్టాలని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారన్నారు. ఇతర పార్టీల నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు.
చేతకాని దద్దమ్మల్లా మారారు : నెలవల
మహానేత వైఎస్సార్ పుణ్యంతో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన నాయకులు నేడు చేతకాని దద్దమ్మల్లా మారారని మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం అన్నారు. వద్దిగుంట కండ్రిగలో నిర్వహించిన సభకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. వైఎస్సార్ రెక్కల కష్టంతో అధికారం చెలాయిస్తున్న వారందరికీ వచ్చే ఎన్నికల్లో ఇళ్ళ దారి పట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీకి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. జిల్లాలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి పటిష్టమైన నాయకత్వం వహిస్తూ వైఎస్సార్ సీపీని దిగ్విజయంగా ముందుకు తీసుకెళుతున్నారన్నారు. నాయుడుపేట, తడ, దొరవారిసత్రం, ఓజిలి మండలాల వైఎస్సార్ సీపీ కన్వీనర్లు తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, కృష్ణరెడ్డి, వెంకటేశ్వరెడ్డి, దేశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎంపీపీ పర్వతరెడ్డి ఇందిర, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వేణుంబాక విజయశేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ లో: టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం మండల కన్వీనర్ చింటు, మరో 50 మంది విద్యార్థి నాయకులు గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో చేరారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఫీజు పోరు దీక్ష సందర్భంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ వెంకటరమణా రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ పంచరెడ్డి చరణ్, జిల్లా అధికార ప్రతినిధి మార చంద్రమోహన్, పట్టణ కన్వీనర్ పండిత్ ప్రేమ్ వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. యువజన విభాగం జిల్లా నాయకుడు దీపక్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ అంగూర్ నరేంధర్‌ల ఆధ్వర్యంలో వీరు పార్టీలో చేరారు. విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Back to Top