వైయస్ఆర్ కాంగ్రెస్‌తోనే సంక్షేమ పథకాల అమలు

అనంతపురం:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమని ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, పార్టీ  కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. ఆర్టీసీలోని ఎన్‌ఎంయూ, ఎంప్లాయిస్ సంఘాల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ అనుబంధ రాష్ట్రీయ మజ్దూర్ ఫెడరేషన్(ఆర్‌ఎంఎఫ్)లో 300 మంది చేరారు. ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి వారికి సభ్యత్వ నమోదు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత మహా నేత వైయస్ రాజశేఖర్‌ రెడ్డి ఆర్టీసీ అభ్యున్నతికి అహర్నిశలూ కృషి చేశారన్నారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆయన మరణాంతరం సంక్షేమ పథకాల అమలు అస్తవ్యస్థంగా మారిందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్రీయ మజ్దూర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్, జిల్లా అధ్యక్షులు అవధాని శ్రీపాద, వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సుధాకర్‌బాబు, బయన్న, విద్యాసాగర్‌రెడ్డి, చింతకుంట మధు తదితరులు పాల్గొన్నారు.

Back to Top