వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేస్తా

హైదరాబాద్, 28 మార్చి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తన రాజకీయ గురువని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ చెప్పారు. గురువారం ఉదయం ఆయన చంచల్‌గుడా జైలుకు వెళ్ళి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన వెంట మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని), ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కూడా ఉన్నారు. శాసన సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా తాను ఆత్మసాక్షిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశానని చెప్పారు. ప్రతిపక్ష టీడీపీ, అధికార కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇకపై తాను వైయస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పనిచేస్తానని రమేష్ ప్రకటించారు. కష్టాల్లో ఉన్న వైయస్ఆర్ కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదని పదే పదే చెబుతూ తిరిగే చంద్రబాబు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాన సమయానికి పారిపోయారని ఎద్దేవా చేశారు.

Back to Top