వైయస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి టీడీపీ నేతలు

గద్వాల:

వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో పెద్ద సంఖ్యలో  చేరుతున్నారు. మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామానికి చెందిన 30 మంది టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి పార్టీ  తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ నియోజకవర్గ నాయకుడు కృష్ణమోహన్‌రెడ్డి స్వగృహంలో వారు సోమవారంనాడు పార్టీలో చేరారు. వెంకటేశ్వర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, తిమ్మప్ప, సత్యారెడ్డి, శివన్న, రాముడు, తిమ్మప్ప, వంశీ, ముణెప్ప, పెద్దరాములు, ఆంజనేయులు, దర్శెల్లి, రామాంజనేయులు, వెంకట్రాములు, పెద్ద వెంకట్రాములు తదితరులు  చేరిన వారిలో ఉన్నారు.

Back to Top