వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరిన కూన శ్రీశైలం గౌడ్

హైదరాబాద్, 6 మే 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ సమక్షంలో కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ సోమవారం సాయంత్రం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కూన శ్రీశైలం గౌడ్‌ 2009లో కుత్బుల్లాపూర్ ‌అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌లోని మున్సిపల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో శ్రీశైలం గౌడ్‌కు పార్టీ కండువా కప్పి శ్రీమతి విజయమ్మ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్‌, పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. అంతకు ముందు శ్రీమతి విజయమ్మ మహానేత వైయస్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు.
Back to Top