వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు

హైదరాబాద్, 04 మే 2013:

రాష్ట్రంలోని వివిధ  ప్రాంతాలలో కాంగ్రెస్ కార్యకర్తలు వందల సంఖ్యలో శుక్రవారం నాడు  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ జిల్లా మనూర్ మండలం గొందిగాంకు చెందిన 500 మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి బి.హనుమంతు ఈ కార్యక్రమానికి  ఆధ్వర్యం వహించారు. ఖమ్మం జిల్లా మణుగూరు మండలం కూనవరం, అన్నారం గ్రామాల నుంచి 160 మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Back to Top