వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చాలి: డాక్టర్ సుధ

వినుకొండ: వినుకొండ మండలం ఉప్పరపాలెంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ నన్నపనేని సుధ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతమైంది. గ్రామానికి చెందిన పలువురు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యులు ఆర్కే, జంగా కృష్ణమూర్తి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ రేవతి, డాక్టర్ నన్నపనేని సుధ తదితరులు పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు.  పార్టీ ఆశయాలకు అనుగుణంగా, పార్టీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతనంగా పార్టీలోకి వచ్చిన కార్యకర్తలు తెలిపారు. సుధ నేతృత్వంలో పార్టీకి చెందిన జిల్లా నాయకులను ఆధ్వర్యంలో తొలిసారిగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం, బహిరంగ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం ఏర్పడింది. జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ప్రసంగిస్తూ సుధ నాయకత్వంలో వినుకొండలో పార్టీ ముందుకు సాగుతుందని చెప్పడంతో కార్యకర్తలు హర్షం తెలిపారు. ముందుగా బాలాజీ ఎస్టేట్‌లోని వైయస్ ధ్యానమందిరంలోని దివంగత నేత డాక్టర్  రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్‌ఎస్పీ కాలనీలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. 
ఎమ్మెల్యే పిన్నెల్లి పాదయాత్ర
మాచర్ల: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు కావాలని కోరుతూ మాచర్ల నుంచి పాలువాయి జంక్షన్ వరకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ నియోజకవర్గ నాయకులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు శ్రీశైలం రోడ్డులోని రామాంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి రెంటచింతల మండలం పాలవాయి జంక్షన్ వరకు సుమారు 17 కిలోమీటర్ల మేర పాదయాత్ర దిగ్విజయంగా నిర్వహించారు. ఐదు మండలాల నుంచి వందలాది వాహనాల్లో తరలి వచ్చిన వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు జేజేలు పలుకుతూ పాదయాత్రలో ఎమ్మెల్యే పీఆర్కే, వెంకటరామిరెడ్డి వెంట నడిచారు. రెండువేల మందికి పైగా కార్యకర్తలు ఆంజనేయస్వామి దేవాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి వెళ్లారు. 

Back to Top