ఎన్ని బూటకపు హామీలు ఇచ్చినా బాబు పప్పులు ఉడకవువైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే ఐజయ్య
కర్నూలు: నిరుద్యోగ భృతి చెల్లించడంలో కూడా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. గతంలో 2 కోట్ల మంది నిరుద్యోగులకు భృతికల్పిస్తామన్న చంద్రబాబు ప్రస్తుతం అనేక ఆంక్షలు విధించి 10 లక్షల మందికి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో యువతను చంద్రబాబు దారుణంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లా పార్టీ క్యాలయంలో వైయస్‌ఆర్ సీపీ నాయకులు శిల్పాచక్రపాణిరెడ్డి, బీవై రామయ్య, ఎమ్మెల్యే వై. ఐజయ్య, కాటసారి రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు పదిశాతం మంది నిరుద్యోగులకు కూడా భృతి ఇవ్వడం లేదని చెప్పారు. గతంలో 2 కోట్ల మందికి అని చెప్పి ప్రస్తుతం 10 లక్షల మందికి రూ. వెయ్యి చొప్పున భృతి అంటూ యూటర్న్ తీసుకున్నారన్నారు. నయవంచన, మోసానికి, వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబని అన్నారు. ముఖ్యమంత్రి యువనేస్తంతో ప్రభుత్వం చేసిన ప్రకటన కోట్లాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లిందని చెప్పారు. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోందన్నారు. వివిధ శాఖల్లో 1.80 లక్షల ఖాళీలు ఉంటే కేవలం 20 వేల పోస్టులు భర్తీ చేయడమేంటని నిలదీశారు. పదవి కోసం బూటకపు హామీలు ఇచ్చిన బాబు పప్పులు ఇక ఉడకవని సూచించారు.
కాపులు మొదలుకుని మైనార్టీల దాకా అన్ని వర్గాలను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని వారు ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్ల పేరిట వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్టులను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైయస్ జగన్ పాదయాత్రకు కాపు సోదరులు ఇస్తున్న మద్దతు చూసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. రాష్ట్రం వైయస్‌ఆర్ సీపీ ఏ సామాజికవర్గ హక్కులకు, డిమాండ్లకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ. 10 వేల కోట్లు ప్రకటించడం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టికి నిదర్శనమన్నారు. గోబెల్స్ ప్రచారంతో జననేత వ్యాఖ్యలను చంద్రబాబు వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు.