విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. హోదా ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ముందుకు వచ్చి పోరాడాల్సిన చంద్రబాబు హోదా ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. హోదా సాధన కోసం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు.