వైయస్‌ఆర్‌సీపీలోకి 2 వేల మంది చేరిక...

 

నలుగురు సర్పంచ్‌లు,నలుగులు ఎంపీటీసీలు
విజయనగరంః వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి.వివిధ పార్టీల నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారు.పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం బలిజపేటకు చెందిన 2వేల మంది జగన్‌ సమక్షంలో  పార్టీలోకి చేరారు.వారిలో నలుగురు సర్పంచ్‌లు, నలుగురు ఎంపిటిసిలు ఉన్నారు. వారిని వైయస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జగన్‌మోహన్‌ రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి అని పార్టీలోకి చేరిన నేతలు తెలిపారు. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ను మించి ప్రజా సంక్షేమపథకాలు అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు అన్యాయం జరగడానికి కారణం టీడీపీ అని మండిపడ్డారు.సుమారు 500 మంది అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు ఆత్మహత్యాలకు పాల్పడ్డారన్నారు.వేలమంది కస్టమర్లు రోడ్డున పడ్డారన్నారు.వైయస్‌ జగన్‌ నాయకత్వంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరుగుతుందనే సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top