పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

కోటవురట్ల : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పటిష్టతకు బూత్‌ కమిటీ సభ్యులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్‌ సెల్‌ అధ్యక్షుడు డీవీ సూర్యనారాయణరాజు అన్నారు. బూత్‌ కమిటీ సభ్యులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణరాజు మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ పాటుపడాలన్నారు. క్రమ శిక్షణతో ఉంటేనే ఎదుగుదల వస్తుందన్నారు. కష్టపడిన వారికి పార్టీలో ఎల్లపుడు సముచిత స్థానం ఉంటుందన్నారు. ప్రతీ ఒక్కరూ మార్చి 31 లోగా ఫొటోలు అందించి పార్టీ ఇచ్చే గుర్తింపు కార్డులు పొందాలన్నారు. మండలంలో 46 బూత్‌ కమిటీలు ఉన్నాయని, ఒక్కొక్క కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప«థకాలు పడకేశాయన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుల నిర్వాకంతో అర్హులకు పింఛన్లు కోత పడ్డాయన్నారు. కొత్తవి మంజూరు కాకపోగా పాత వాటిని తొలగించారన్నారు. 2014 వరకు పింఛన్లు పొంది, ప్రస్తుతం పింఛన్లు నిలిచిపోయిన వారి జాబితా తయారు చేస్తున్నామన్నారు. రాజకీయ కక్షల కారణంగా ఈ విధంగా మండలంలో సుమారు 600 మంది అర్హులకు పింఛన్లు ఆగిపోయాయన్నారు. తిరిగి వీటిన్నిటి సాధించేంత వరకు వైయస్‌ఆర్‌ సీపీ పోరాడుతుందన్నారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యురాలు వంతర వెంకటలక్ష్మి, పార్టీ నాయకులు సత్యనారాయణరాజు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 
Back to Top