తిరుపతిలో ఎమ్మెల్యే ప్రజాబాట

తిరుపతి:

భగ్గు మంటున్న నిత్యావసర ధరల వల్ల ప్రజలు రగిలి పోతున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. వీరి ఆగ్రహజ్వాలలకు కాంగ్రెస్ ప్రభుత్వం మసి కావడం ఖాయమన్నారు. ప్రజాబాటలో భాగంగా ఎమ్మెల్యే శుక్రవారం పర్యటించారు. ధరలు పెరుగుదల, తాగునీటి సమస్య, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ ధరల పెరుగుదలపై ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారని, వీరి ఆగ్రహ జ్వాలలకు ప్రభుత్వం పతనం కాకతప్పదన్నారు. స్థానికంగా ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాచీన ఆలయమైన శ్రీవేశాలమ్మ గుడి వద్ద పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందన్నారు.

Back to Top