<span style="text-align:justify">ఏపీ అసెంబ్లీ: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మిర్చి గిట్టుబాటు ధర గురించి ప్రశ్నించే వరకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎట్టకేలకు మిర్చిని మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని ప్రకటన చేయడం అది వైయస్ జగన్ క్రెడిట్ అని ఎమ్మెల్యే అన్నారు. శనివారం ధరల స్థిరీకరణపై సభలో వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇవ్వగా, అధికార పక్షం చర్చకు అంగీకరించలేదు. దీంతో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలుపగా సభను పది నిమిషాలు వాయిదా వేశారు. ఈ సందర్భంగా మీడియా పాయింట్‌లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మిర్చి పంట సాగు కోసం ఎకరాకు రూ. 1.25 లక్షల పెట్టుబడిపెట్టి రూ.20 క్వింటాళ్లు పండించారు. అయితే నాటు వైరైటీకి రూ.3 వేల కన్నా ఎక్కువ ధర లేదు. మార్కెట్‌లో కొనే పరిస్థితి లేదు. నిన్న వైయస్ జగన్ గుంటూరు మిర్చి యార్డును సందర్శించి మిర్చి రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆ వెంటనే సాయంత్రం మార్కెట్ యార్డు చైర్మన్ సీఎంతో భేటీ అయ్యి మార్కెట్‌ఫెడ్ ద్వారా కొనుగొలు చేస్తామని ప్రకటన చేశారు. అంటే ప్రతిపక్షనేత ప్రశ్నిస్తే తప్పా ఆ ప్రభుత్వానికి చలనం రావడం లేదు. నాగార్జున సాగర్‌కు నీళ్లు ఇవ్వకుండా రాయలసీమకు నీళ్లు ఇస్తున్నామని ఈ ప్రభుత్వం ప్రకటన చేస్తోంది. నాగార్జున సాగర్ కుడికట్టుకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. గత రెండేళ్ల నుంచి వరి పంటకు నీళ్లు ఇవ్వకుండా దాదాపు ఖరీప్ పూర్తి అయ్యింది. రబీకైనా ఇవ్వండి అంటే ఇవ్వడం లేదు. శ్రీశైలంలో నీరున్నా..కేవలం మంచినీటిని మాత్రమే ఇస్తామని చెప్పి రైతులను అన్యాయం చేస్తోంది. కృష్ణా డెల్టాకు పట్టిసీమ, పులిచింతల ద్వారా నీళ్లు ఇస్తూ, రాయలసీమకు కూడా ఇచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం నాగార్జున సాగర్ కుడికాల్వ ఆయకట్టు కింద ఉన్న రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. నీళ్లు ఇవ్వకపోతే ఆయకట్టులో పూర్తిగా మెట్ట పంటలు వేసుకున్నారు. మినుము ఎక్కడా కూడా పండలేదు. కంది పూర్తిగా డ్యామెజ్ అయ్యింది. ఎక్కడా కూడా మెట్టపైర్లు మాగాణిలో పండే పరిస్థితి లేదు. పండినా గిట్టుబాటు ధర కల్పించడం లేదు. పల్నాడు ప్రాంతంలో ఉన్న మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకోవడం తప్ప ఎక్కడా కూడా రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు.</span>