తాగు నీటికి గతి లేదు, సింగపూర్ కు సంపెంగ పరిమళాలు

చంద్రబాబు ప్రభుత్వ పని తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ప్రత్యేక విమానాలకు, శంకుస్థాపనల వంటి వాటికి మాత్రం వందల కోట్ల రూపాయిలు   నీళ్లలా ఖర్చు పెడతారు. ప్రజలకు అత్యవసరమైన తాగునీరు వంటి విషయాల్లో నిధులు లేవని, బీద రాష్ట్రమని కాకమ్మ కథలు కావ్ కావ్ మంటూ వినిపిస్తారు.

చంద్రబాబు ప్రభుత్వం కొలువు దీరినప్పటి నుంచి గ్రాఫిక్ ప్రజంటేషన్లకు కొదవే లేదు. అన్ని కలల్ని రంగుల ప్రపంచంలో చూపిస్తూ ప్రజలకు చెవుల్లో కాలీఫ్లవర్ లు పెడుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఐదు రకాల గ్రిడ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వాటర్ గ్రిడ్, విద్యుత్, రోడ్డు, గ్యాస్, డిజిటల్ గ్రిడ్ లను ఏర్పాటుచేసి రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకొని వెళతామని ప్రకటించారు. గ్రామ గ్రామనికి, ఇంటింటికి సురక్షిత తాగునీరు ప్రవహింప చేస్తామని రంగుల ప్రపంచాన్న విడమరిచి చెప్పారు. దీని మీద ఎల్లో మీడియాలో కథలు కథలుగా ప్రచారాలు జరిగాయి.

కొద్ది రోజులకే అధికారులు వాటర్ గ్రిడ్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి ఒక నివేదికను ప్రభుత్వం ముందు ఉంచారు. కాస్తంత నిధుల్ని ఉదారంగా విడుదల చేస్తే వాటర్ గ్రిడ్ ను పూర్తి చేయవచ్చని అన్ని ప్రాంతాలకు తాగునీరు అందించ వచ్చని నివేదించారు. ప్రత్యేక విమానాలు, విదేశీ పర్యటనలకు విరివిగా డబ్బు ఖర్చు పెడుతున్న చంద్రబాబు దూకుడు చూసి ప్రజలకు ఉపయోగ పడే ఈ పథకానికి నిధులు కేటాయిస్తారని అధికారులు భావించారు. దీన్ని చంద్రబాబు పక్కన పెట్టేయటంతో అధికారుల బ్రందం రివైజ్డ్ ప్రతిపాదన తెచ్చింది. నీటి కొరతతో కట కట లాడుతున్న రాయలసీమ నాలుగు జిల్లాలకు వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, దాహార్తిని తీర్చినట్లవుతుందంటూ మరో ప్రతిపాదన రూపొందించారు. అది మూలన పడిపోయింది. ఆఖరికి రాయలసీమలోని బాగా నీటి కొరత ఉన్నప్రాంతాలకు వాటర్ గ్రిడ్ ను ఉపయోగిద్దామని ప్రతిపాదించినా చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్ లో పెట్టేసింది. నిధులు లేవంటూ అటక ఎక్కించేందుకు ఈ ప్రతిపాదనను పంచాయితీ రాజ్ శాఖ పరిధిలో పెండింగ్ లో ఉంచేశారు.

ప్రజలకు అవసరమయ్యే తాగునీటికి నిధులు లేవని చెబుతూనే సింగపూర్ కంపెనీలకు అవసరమైన అన్ని ఫైళ్లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమకు నీళ్లు ఇచ్చేందుకు రూపొందించిన ఈ గ్రిడ్ పథకానికి గ్రహణం పట్టినట్లే అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

తాజా ఫోటోలు

Back to Top