టీడీపీ నిర్వాకం వల్లే కొనసాగుతున్న ప్రభుత్వం

ఆత్మకూరు పెంటర్ (మహబూబ్ నగర్ జిల్లా):

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపే అవకాశం ఉన్నా తెలుగుదేశం పార్టీ కాపాడుతోందని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఆరోపించారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే బలం తెలుగుదేశం పార్టీకి ఉందన్నారు. అయినా టీడీపీ అందుకు ముందుకు రావడంలేదని శ్రీమతి షర్మిల విమర్శించారు.

     శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలులో పెట్టించారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు పెద్దపెద్ద వాళ్లతో మాట్టాడి జగనన్నకు బెయిల్ రాకుండా చేస్తున్నారని ఆమె విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలు ఎంతో కాలం పని చేయవని జగనన్న తప్పకుండా బయటకు వస్తారని శ్రీమతి షర్మిల ధీమా వ్యక్తం చేశారు.

     మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల శుక్రవారం సాయంత్రం పాలమూరు జిల్లాలోని ఆత్మకూరు‌కు చేరుకున్నారు. ఆత్మకూరు సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఎటువంటి అక్రమాలు చేయకపోయినా కొందరు నేతలు జగనన్న మీద కేసులు పెట్టారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం బెయిల్ రావాల్సిన ఉన్నా, కాంగ్రెస్ జేబు సంస్థగా మారిన సీబీఐ అడ్డుపడుతోందని ఆమె ధ్వజమెత్తారు.

     వైయస్ఆర్ కడప జిల్లాలో అక్టోబర్ 18న ప్రారంభమైన శ్రీమతి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 44 రోజులకు చేరుకుంది. పాలమూరు జిల్లాలో శుక్రవారం నాటికి ఎనమిది రోజులపాటు శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగింది.

Back to Top