నయవంచక పాలనకు చరమగీతం పాడాలి

ఢిల్లీ:  బూటకపు హామీలిచ్చి
అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు నల్లటి అబద్దాలతో శ్వేతపత్రాలను (White paper with black lies ) విడుదల
చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ ఇక్బాల్ అన్నారు. ప్రజల సంక్షేమాన్ని
మరచి శ్వేతపత్రాలతో మరోసారి వంచిస్తున్నారని మండిపడ్డారు. తాను ఏవ ర్గాన్ని వివక్షకు గురి చేయలేదంటూ
చంద్రబాబు ఇప్పుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులను, మైనార్టీలను,
ఎస్టీలను, వివక్షకు గురి చేశారు. కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకనే ఆయా వర్గాలకు
మంత్రి  పదవులు ఇచ్చారన్నారు. ప్రజా
స్వామ్యం పేరుతో సంక్షేమాన్నిమరచి దేశం అంతా తిరగడం చూస్తున్నాము. తెలంగాణాలో
ఇప్పటికే దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారనీ, ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే రకమైన తీర్పును
ప్రజలు ఇవ్వనున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నయవంచకు గురి కావడానికి కారకులెవ్వరో
ప్రజలందరికీ తెలుసనని ,అటువంటి నయవంచక రాజకీయాలకు చరమ గీతం పాడే రోజు దగ్గర్లోనే
ఉందన్నారు.

Back to Top