నిజాలు మాట్లాడితే టీడీపీకి మనుగడ ఉండదు

  • చెప్పింది చేసితీరాలనడానికి చంద్రబాబు నైతిక హక్కుందా
  • నంద్యాల వాపును చూసి బలుపనుకుంటున్న చంద్రబాబు
  • ఇప్పటి వరకు బాబు చేసింది రియల్‌టైం పాలిటిక్స్‌ కాదా
  • కురుక్షేత్ర యుద్ధంలో అంతిమ విజయం పాండవులదే...
  • 2019 కురుక్షేత్రంలో ధర్మంవైపు నిలబడే వైయస్‌ఆర్‌ సీపీదే విజయం
  • నీళ్లు లేని నదులకు బాబు హారతులు ఇవ్వడం విడ్డూరం
  • తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకుంటే కేసు తిరగతోడుతారని భయమా
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
హైదరాబాద్‌: చేసేదే చెప్పండి.. చెప్పింది చేసి తీరాలని టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ మాట చెప్పడానికి చంద్రబాబుకు నైతిక హక్కుందా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రశ్నించారు. టీడీసీ నేతలు నిజాలు చెప్పడం మొదలు పెడితే తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికలను చూసి చంద్రబాబు విర్రవీగిపోతున్నాడని కాకాణి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకాణి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా... ఓటు కోట్ల విషయాలు, అవినీతి గురించి మాట్లాడితే.. చంద్రబాబు బయట తిరిగే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏదో మాట్లాడాలనే ఆలోచనలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. టీడీపీ అబద్ధపు హామీల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. తగిన సమయంలో చంద్రబాబు గుణపాఠం చెబుతారన్నారు. 

డబ్బు పంచి గెలిచి విర్రవీగుతున్నాడు
చంద్రబాబు రియల్‌టైం పాలిటిక్స్‌ చేస్తానని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అంటే ఇప్పటి వరకు చేసింది రియల్‌టైం పాలిటిక్స్‌ కాదా అని కాకాణి ప్రశ్నించారు. చంద్రబాబుకు కొన్ని ఊతపదాలున్నాయని లోహ్యాంగింగ్‌ ఫ్రూట్స్, లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్, బ్రిక్‌ టూ బ్రిక్, ట్రన్స్‌ప్రెంట్‌ గవర్నమెంట్, అదే మాదిరిగా రియల్‌టైం పాలిటిక్స్‌ అని ఎద్దేవా చేశారు. నంద్యాల ఎన్నికలను నమూనాగా తీసుకోవాలని బాబు వారి పార్టీ నేతలకు చెబుతున్నాడని, అలా జరిగితే చంద్రబాబుకు 175 నియోజకవర్గ స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకరన్నారు. నంద్యాల మాదిరిగా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఒకే నియోజకవర్గంలో తిష్ట వేస్తారన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచి గెలిచి విర్ర వీగిపోతున్నాడన్నారు. మహాభారత యుద్ధంలో కౌరవులు జూదంలో గెలిచారని, ఆ తరువాత జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామంలో ధర్మంవైపు నడిచిన పాండవులు విజయం సాధించారన్నారు. అదే విధంగా ప్రగల్భాలు పలుకుతూ విజయం సాధించామని చెప్పుకుంటున్న చంద్రబాబు మహాభారతంలో కౌరవులు జూదంలో విజయం సాధించడం లాంటిదని, 2018లోనైనా 19లోనైనా జరిగే కురుక్షేత్ర మహాసంగ్రామంలో ధర్మంవైపు నడిచే వైయస్‌ఆర్‌ సీపీ విజయం సాధిస్తుందన్నారు. నంద్యాల ఎన్నిక గెలుపు వాపులాంటిందని దాన్ని చూసి చంద్రబాబు బలుపు అనుకుంటున్నాడని కాకాణి ఎద్దేవా చేశారు. ఉగ్రవాద శిక్షణ ఇచ్చిన కార్యకర్తలను ఇళ్ల మీదకు పంపించి బెదిరింపులకు పాల్పడి విజయం సాధించి వి్రరవీగాల్సిన పనిలేదన్నారు.

బాబు పబ్లిసిటీ పిచ్చికి 29 మంది బలి
నీళ్లు లేని నదులకు హారతులు ఇస్తూ చంద్రబాబు జలసిరికి హారతి అంటూ కొత్త నినాదం తీసుకొచ్చాడని కాకాణి గోవర్థన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నదులను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. చంద్రబాబు.. కరువు కవల పిల్లలు అనే సామెత కూడా ఉందని చురకంటించారు. నాగార్జున సాగర్, కృష్ణ, శ్రీశైలం డ్యామ్‌లలో ఎక్కడైనా నీళ్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. గోదావరిపై అక్రమంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుంటే దానికి ఎందుకు అభ్యంతరాలు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్నారని ఏదైనా అభ్యంతరం చెబితే కేసు తిరగదోడుతారనే భయంతో రాష్ట్ర రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగభద్ర నుంచి నీరు రాకపోతే కర్ణాటకను ఎందుకు అడగడం లేదు. ఆల్మట్టి నుంచి కృష్ణ జలాలు రాకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదని చంద్రబాబును నిలదీశారు. అక్కడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కుమ్మకై పనిచేస్తున్నారా చంద్రబాబూ అంటూ ప్రశ్నించారు. కృష్ణా పుష్కరాలు నిర్వహించి రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి సినిమా హీరోలా పబ్లిసిటీ ఫోజు ఇచ్చి 29 మందిని బలితీసుకున్నాడని ధ్వజమెత్తారు. 
Back to Top