టీడీపీ వి అబద్దాలు: గుడివాడ

విశాఖపట్నం) పార్టీకి సంబంధం లేని వ్యక్తిని తెలుగుదేశంలో
చేర్చుకొని, అబద్దాలు ప్రచారం చేస్తున్నారని వైయస్సార్సీపీ విశాఖ జిల్లా
అధ్యక్షులు గుడివాడ అమర్ నాథ్ పేర్కొన్నారు. విశాఖ జిల్లా పార్టీ కేంద్ర
కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కి ఎలాంటి సంబంధం
లేని ఒక వ్యక్తి  తెలుగుదేశం పార్టీ లో
చేరితే ప్రముఖ పత్రికలు ... వైయస్సార్సీపీ ముఖ్య నేత, కీలక నేత తెలుగుదేశం లో
చేరిక అంటూ దొరబాబు గురించి వార్తలు రాయడం చాలా శోచనీయము అన్నారు.  పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎలాంటి
కార్యక్రమాలలో పాల్గొనని వ్యక్తి కి, తమ పార్టీ నేతగా గుర్తింపు ఆపాదించటం సిగ్గు
చేటు అన్నారు.  దొరబాబు కి పార్టీ లో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదని గుర్తు చేశారు.
చంద్రబాబు ఢిల్లీ యాత్రలతో ఉపయోగం లేదని స్పష్టం చేశారు. ఈ పత్రికా సమావేశం లో
గాజువాక కన్వీనర్ తిప్పల నాగిరెడ్డి , విశాఖ సౌత్ నియోజకవర్గ
సమన్వయ కర్త కోలా గురువులు ,పెందుర్తి నియోజకవర్గ సమన్వయ
కర్త అన్నమరెడ్డి అదీప్ రాజ్ ,రాష్ట్ర పార్టీ నాయకులు కొయ్య
ప్రసాద్ రెడ్డి, కంపా హనోకు, జాన్
వెస్లీ  , రవి రెడ్డి
, మార్టపూడి పరదేశి , బర్కత్ అలీ ,బయ్యవరపు రాధా,బోని శివ రామకృష్ణ  , సిర్తల వాసు ,షరీఫ్ మొదలగు
వారు పాల్గొనడం జరిగింది.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top