కాకినాడలో విచ్చలవిడిగా టీడీపీ డబ్బులు పంపిణీ

తూర్పుగోదావరిః కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. టీడీపీ నేతలు యథేశ్చగా డబ్బులు పంచుతున్నారు. ఇద్దరు మంత్రుల పర్యవేక్షణలో వార్డుకు మూడు రూ. కోట్లు వెదజల్లుతున్నారు. కాకినాడలో ఇప్పటికే 42కోట్లకు పైగా డబ్బులు పంపిణీ చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. 12, 35 వార్డుల్లో టీడీపీ నేతలు డబ్బులు పంచుతూ మీడియాకు చిక్కారు. మరోవైపు, సర్వే ముసుగులో టీడీపీ ప్రలోభాలకు తెరలేపింది. డివిజన్ కు ముగ్గురు చొప్పున ఇంటింటా తిరుగుతున్నారు. ఎవరికి అనుకూలమో తెలుసుకొని టీడీపీ నేతలకు చేరవేస్తున్నారు. సర్వే పేరుతో ప్రలోభపెడుతున్న వ్యక్తులను వైయస్సార్సీపీ నేతలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Back to Top