<strong>అనంతపురం :</strong> చంద్రబాబు జిల్లాల పర్యటనలు వృథా అని రాప్తాడు వైయస్‌ఆర్‌సీపీ కోఆర్డీనేటర్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఉపాధి పనులతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు.. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. డ్వాక్రా రుణమాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారన్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. హామీలు విస్మరించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారని దుయ్యబట్టారు.