జగన్‌ సభతో టీడీపీ నేతల్లో వణుకు పుట్టింది

–– బాబుకు చిత్తశుద్ధి ఉంటే మూడేళ్లలో ఎందుకు నంద్యాల వైపుకు చూడలేదు
– ఫిరాయింపు నేతలకు దమ్ముంటే పదవులకు రాజీనామా చేయాలి

కర్నూలు :సీఎం చంద్రాబాబు నాయుడు నంద్యాలకు రెండు సార్లు వచ్చినా కూడా జనాల నుంచి స్పందన లేదని, వైయస్‌ఆర్‌సీపీ జాతీయ అధ్యక్షులు వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి నంద్యాలలో నిర్వహించిన సభకు భారీగా అన్ని వర్గాల ప్రజలు రావడంతో టీడీపీ నేతల వెన్నులో వణుకుపుట్టిందని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ము పెట్టి దొంగిలించిన నేత చంద్రబాబు అని, రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తుల వల్లే నైతిక విలువలు దిగాజారాయని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలను చేయాలనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణి రెడ్డిని  ఎందరో రాజకీయ నాయకులు అభినందిస్తున్నారని అన్నారు. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు దమ్ము, దైర్యం ఉంటే తక్షణమే పదవులకు రాజీనామా చేసి టీడీపీ గుర్తుపై గెలిచిన తరువాత ఇతరులపై మాట్లాడాలన్నారు. 30 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా తోటి ఎమ్మెల్యేలను మీ అంతు చూస్తా, మీ నాలుక కోస్తానని మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా ఎమ్మెల్యే బొండా ఉమా అసెంబ్లీలో పాతస్తా అన్నప్పుడు ఎందుకు స్పందించలేదని ఐజయ్య ప్రశ్నించారు. మంత్రి పదవులు ఇస్తానని, ఇద్దరు మైనార్టీ ఎమ్మెల్యేలో టీడీపీ చేర్చుకోని ఎందుకు పదవులు ఇవ్వలేదని, ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టీ మైనార్టీలు బాబుకు గుర్తుకు వచ్చారని అన్నారు. ఉప ఎన్నికలకు ముందు నంద్యాల వైపు చూడని సీఎం, మంత్రులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. బాబు దళితులను, గిరిజనులను, మహిళలను కించపిరిచేటట్లు మాట్లాడారన్నారు. రెండు సార్లు పర్యటించిన సీఎం మాటలను నంద్యాల ప్రజలు నమ్మడం లేదు కాబట్టే బాబు సభలు, యాత్రలకు ప్రజలు రాలేదన్నారు. ప్రజా సంక్షేమాన్ని వదిలి మంత్రులు అడ్డదారుల్లో కోట్లు పెట్టి ఉప ఎన్నికల్లో గెలిచేందుకే తిష్ట వేశారని అన్నారు. నంద్యాలల్లో భారీ మెజార్టీతో శిల్పా మోహన్‌ రెడ్డి గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Back to Top