వైయస్సార్సీపీలో చేరిన తమ్ముళ్లు

గుంటూరుః పొన్నూరులో టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలోకి చేరికలు జరిగాయి. రెండున్నరేళ్లుగా అవినీతి, అక్రమాలే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్న టీడీపీ తీరును నిరసిస్తూ ఒక్కొక్కరుగా తమ్ముళ్లు పార్టీని వీడుతున్నారు.  వైయస్సార్సీపీ నేత వెంకటరమణ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన నేతలు పొన్నూరులో వైయస్సార్సీపీలో చేరారు. రమణ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా రమణ మాట్లాడుతూ... ప్రతీ ఒక్కరికీ పార్టీ చేదోడువాదోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top